ఆర్థిక మాంద్యం కుర్ర ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఎక్కడ పడితే అక్కడ వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తూ.. జంటలు జంటలుగా తిరిగే కుర్రకారు ఇటీవల కొన్ని రోజులుగా బొత్తిగా కనిపించడం మానేసారు.
ఒకప్పుడు అమ్మాయి అబ్బాయి స్నేహాలు చాలా ఎక్కువగా కనిపించేవి. అదేమిటో గత జనవరిలో మాంద్యం ప్రారంభం అయినప్పటి నుంచి ఈ స్నేహాల మధ్య విబేధాలు రావడం మొదలయ్యాయంట.
ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న మా మిత్రురాలు చెప్పిన వివరాలు.. నాకు ముందుగా విడ్డూరంగా అనిపించినా.. ఆలోచించగా ఆలోచించగా నిజమేనేమో అనిపించింది.
ఇంతకీ విషయం ఏమిటంటే...
గతంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మెలిసి స్నేహితులుగా మెసలేవారు. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చిందంట.
అబ్బాయిలు.. అమ్మాయిల స్నేహం ఇప్పుడు అమ్మాయిలు-అమ్మాయిలు, అబ్బాయిలు-అబ్బాయిల స్నేహంగా మారిపోయాయంట. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియక దిగాలు పడుతున్న వారికి ఇప్పుడు ఇదే మంచి మార్గం అనుకుంటున్నారు. ఎందుకిలా? అని అడిగితే... అమ్మాయిలతో కలిసి తిరుగుతున్నప్పుడు ఖర్చులన్నీ కూడా అబ్బాయిలయే కదా. ఉదాహరణకు బండి పెట్రోలు, ఇంకా.. ఇతర ఖర్చులు.. తెలియని కావు కదా. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఈ ఖర్చులను తట్టుకోవాలంటే.. వారికి ఖర్చులను పంచుకునేవారు కావాలి. అందుకే ఈ మార్పు ..
ఇంకా వివరాలు ఉన్నాయి....
అవన్నీ కొద్దిగా సేకరించిన తర్వాత చెబుతాను...
Saturday, December 27, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment